భువనగిరి మదర్ డైరీ ముందు పాడి రైతుల ధర్నా..!
BHNG: భువనగిరి మదర్ డైరీ కార్యాలయం ముందు పాడి రైతులు ధర్నా చేపట్టారు. మదర్ డైరీ ఆస్తులు అమ్ముకుంటూ.. పాలకవర్గం సభ్యులు జల్సాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. రైతులు మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఏడు నెలల పాల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మదర్ డైరీని నిర్లక్ష్యం చేస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.