VIDEO: అంగన్వాడి భవనాన్ని ప్రారంభించిన సీడీపీవో

NZB: మోస్రా మండలం తిమ్మాపూర్ గ్రామంలో 'పనుల జాతర' కార్యక్రమంలో భాగంగా నూతన అంగన్వాడీ భవనాన్ని బోధన్ సీడీపీవో పద్మజా, మండల ఎంపీడీవో శ్రీనివాస్ ప్రారంభించారు. 12 లక్షల 15వ ఆర్థిక సంఘ నిధులతో నిర్మించిన ఈ భవనాన్ని శుక్రవారం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సుమలత, పలువురు అంగన్వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.