పరవళ్లు తొక్కుతున్న మోయతుమ్మెద వాగు

పరవళ్లు తొక్కుతున్న మోయతుమ్మెద వాగు

SDPT: గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నంగునూరు మండలం గుండా వెళ్లే మోయతుమ్మెద వాగు పరవళ్లు తొక్కుతోంది. వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో దానిపై నిర్మించిన ఆరు ప్రధాన చెక్ డ్యామ్‌లు పూర్తిగా నిండిపోయాయి. ఖాతా, ఘనపూర్, అక్కనపల్లి, నంగునూరు, సిద్ధనపేట గ్రామాల్లోని ఈ చెక్ డ్యామ్‌లు జలకళను సంతరించుకున్నాయి.