నల్లబర్లీ పొగాకు నిల్వకు 18 గోదాములు: కలెక్టర్

నల్లబర్లీ పొగాకు నిల్వకు 18 గోదాములు: కలెక్టర్

BPT: రైతుల నుంచి కొనుగోలు చేసిన నల్లబర్లీ పొగాకును నిల్వ చేయడానికి 18 వ్యవసాయ మార్కెటింగ్ శాఖ గోదాములను గుర్తించినట్లు కలెక్టర్ వెంకట మురళి శనివారం తెలిపారు. ఆ గోదాములలో పొగాకు నిల్వ చేయడానికి 1.37 లక్షల చదరపు అడుగుల సామర్థ్యం ఉందన్నారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని సీఎస్‌పురం, జగ్గయ్యపేట, పిడుగురాళ్లలో గోదాములు ఏర్పాటు చేస్తామన్నారు.