బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షడికి సన్మానం

బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షడికి సన్మానం

వనపర్తి జిల్లా న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెండోసారి ఘనవిజయం సాధించాడు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ఆయన్ని శాలువాతో సన్మానించారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించి, న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయాలని చిన్నారెడ్డి సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.