సేకరించిన చెత్తను సంపద కేంద్రానికి తరలించాలి: MPDO
VZM: రోడ్లు , కాలువల్లో చెత్త వేయకుండా గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలని ప్రజలను బొబ్బిలి MPDO రవికుమార్ కోరారు. మంగళవారం స్దానిక గున్నతోటవలసలో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేయాలని సిబ్బందికి ఆదేశించారు. అలా సేకరించిన చెత్తను చెత్త సంపద కేంద్రానికి తీసుకుని వెల్లాలని గ్రీన్ అంబాసిడర్లకు సూచించారు.