'పెద్ది' ఫస్ట్ సింగిల్ 'చికిరి'.. దాని అర్థమిదే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న మూవీ 'పెద్ది'. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ పేరు 'చికిరి చికిరి' అని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పదం అర్థాన్ని వివరిస్తూ టీం పోస్ట్ పెట్టింది. అలంకరణ అవసరంలేని ఆడపిల్లల్ని ముద్దుగా చికిరి అని పిలుస్తారని తెలుపుతూ ప్రోమో షేర్ చేసింది. పూర్తి పాట ఈ నెల 7న విడుదల కానుంది.