VIDEO: కంచికచర్ల శివారులో రోడ్డు ప్రమాదం

VIDEO: కంచికచర్ల శివారులో రోడ్డు ప్రమాదం

NTR: కంచికచర్ల శివారు బైపాస్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న కారు, అకస్మాత్తుగా యూటర్న్‌ తీసుకున్న బైక్‌ను ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, హైవే సిబ్బంది అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.