VIDEO: కాల్వపల్లిలో ఉద్రిక్తత..!
MLG: తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామ శివారులో మంగళవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు 25 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల చుట్టూ అటవీ శాఖ అధికారులు జేసీబీతో కందకాలు తవ్వే ప్రయత్నం చేయగా గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పనులను అడ్డుకున్నారు. తమ జీవనాధారమైన భూములను లాక్కోవద్దని ఆందోళనకు దిగారు.