నేడు కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఎమ్మెల్యే పర్యటన
PDPL: కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఇవాళ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. వడ్ల కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి ఆయన హాజరుకానున్నారని తెలిపారు. మడిపల్లి కాలనీలో ప్రారంభమై పెగడపల్లి, గంగారం, పందిళ్ల, లక్ష్మీపూర్, ఆరేపల్లి, ఇప్పలపల్లి, తారుపల్లి, మీర్జంపేట, కాల్వ శ్రీరాంపూర్ గ్రామల్లో పర్యటించనున్నారు.