ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

కృష్ణా: గన్నవరంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు లారీ ఢీకొని మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు.