నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని LIC ఫీడర్, నల్లబండ ఫీడర్ పరిధిలో విద్యుత్ లైన్ల అత్యవసర మరమ్మతుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది. లైన్ల నిర్వహణ పనుల దృష్ట్యా ఈ కోత విధిస్తున్నట్లు ట్రాన్స్‌కో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు. పనులు పూర్తయ్యే వరకు వినియోగదారులు సహకరించాలని కోరారు.