'ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్'
అన్నమయ్య: ప్రజా సమస్యల పరిష్కారానికి 'ప్రజా దర్బార్' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 6 మండలాల నుంచి దాదాపు 60కి పైగా అర్జీలను ఆయన స్వీకరించారు. సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.