ఆలమూరులో ఘనంగా మదర్స్‌ డే వేడుకలు

ఆలమూరులో ఘనంగా మదర్స్‌ డే  వేడుకలు

కోనసీమ: అమ్మతనం కన్నా కమ్మనైనది ఈ సృష్టిలో లేదని, అమ్మను అందరూ దైవంగా ఆరాధించి పూజించాలని కొత్తపేట ఐసీడీఎస్‌ సీడీపీవో అధికారి గజలక్ష్మి అన్నారు. మదర్స్‌ డేను పురస్కరించుకుని ఒక రోజు ముందుగా ఆలమూరు అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. అంగన్వాడీ చిన్నారులందరూ తమ తల్లుల కాళ్లు కడిగి పాదపూజ చేసి, ఆశీర్వాదాలు తీసుకున్నారు.