VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
HYD: ఘోర రోడ్డు ప్రమాదం ఉప్పల్ పరిధిలో జరిగింది. చర్లపల్లి నుంచి ఉప్పల్ వైపు వెళ్తున్న బైక్ను, HMT నగర్ వద్ద ఏపీ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో బైక్ పై భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లల కళ్ల ఎదుటే తల్లి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.