లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం
NTR: విజయవాడలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. విద్యార్థినుల ఫిర్యాదుపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ కళాశాలను బుధవారం సందర్శించి విచారణ చేపట్టారు. విద్యార్థినులతో మాట్లాడగా వేధింపుల ఆరోపణల్లో నిజానిజాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని వారు తెలిపారు.