సబ్ స్టేషన్ పనులు ఆపేయాలని నిరాహార దీక్ష
JGL: కథలాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న 220/132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పనులు ఆపేయాలని కోరుతూ గ్రామ యువకులు మంగళవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సబ్ స్టేషన్ నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావం వల్ల సమీపంలోని ప్రభుత్వ విద్యాలయాల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇబ్బంది కలిగించే పనులను నిలిపివేయాలన్నారు.