ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్

TG: ప్రభుత్వ గ్రంథాలయాల్లో పనిచేస్తున్న 173 ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సర్వీసులను మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగుల వేతనాలను థర్డ్ పార్టీ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా చెల్లిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. డేటా ఎంట్రీ ఆపరేటర్, లైబ్రేరియన్‌కు నెలకు రూ.19,500, లైబ్రరీ హెల్పర్, రికార్డు అసిస్టెంటుకు రూ.15,600 వేతనం చెల్లించనుంది.