మహిళ అదృశ్యంపై కేసు నమోదు
KDP: మహిళ అదృశంపై కేసు నమోదు చేసినట్లు మైదుకూరు సీఐ రమణారెడ్డి తెలిపారు. మైదుకూరులోని శివాపురానికి చెందిన భూమాయపల్లె ఓబులమ్మ (57) మంగళవారం ఇంటి నుంచి పని మీద వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు పరిసర గ్రామాల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.