INSPIRATION: విశ్వనాథన్ ఆనంద్
విశ్వనాథన్ ఆనంద్.. భారతదేశానికి వన్నె తెచ్చిన చెస్ క్రీడాకారుడు. 14 ఏళ్లకే జూనియర్ జాతీయ చెస్ ఛాంపియన్‌షిప్ సాధించారు. ఇప్పటి వరకు ఐదు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నారు. చదరంగంలో అత్యున్నత బిరుదైన గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన తొలి భారతీయుడు. చదరంగంలో ఆయన చేసిన సేవలకు గానూ ఆయనను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, పద్మ విభూషణ అవార్డులు వరించాయి.