VIDEO: 'ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి'

GNTR: ఉచిత బస్సు పథకం అమలు వల్ల తమ ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని పెదనందిపాడు పాత బస్టాండ్ సెంటర్లో ఆటో కార్మికులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకానికి ఆటో కార్మికులు వ్యతిరేకం కాదని, కానీ ఈ పథకం ప్రభావంతో నష్టపోతున్న ఆటో కార్మికులను రక్షించే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.