బుర్దగూడ చెరువును పునరుద్ధరిస్తాం: MLA

బుర్దగూడ చెరువును పునరుద్ధరిస్తాం: MLA

ASF: కాగజ్ నగర్ మండలంలోని అంకుశాపూర్, బుర్దగూడ, చారిగాం గ్రామాలలో BJP మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా MLA హరీష్ బాబు ప్రచారం నిర్వహించారు. MLA మాట్లాడుతూ.. అంకుశాపూర్‌లో రెండు సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం నిర్మించామని తెలిపారు. వరదల వలన దెబ్బతిన్న బుర్దగూడ చెరువును పునరుద్ధరిస్తామని, అంగన్వాడీ భవనం నిర్మిస్తామని తెలిపారు.