భారత్-పాక్‌ సంయమనం పాటించాలి: UAE

భారత్-పాక్‌ సంయమనం పాటించాలి: UAE

ఇవాళ తెల్లవారుజామున పాకిస్తాన్, POKలోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత్, పాక్ సంయమనం పాటించాలని కోరింది. ఉద్రిక్తతల వల్ల ప్రాంతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని యూఏఈ ఆందోళన వ్యక్తం చేసింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ మేరకు UAE ఉప ప్రధాని షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఒక ప్రకటనలో తెలిపారు.