నేడు ఆర్మూర్ పట్టణంలో 'జనహిత పాదయాత్ర'

NZB: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేపట్టిన 'జనహిత పాదయాత్ర' ఇవాళ ఆర్మూర్ చేరుకోనుంది. నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమై, గగ్గుపల్లి, ఇస్సాపల్లి గ్రామాల మీదుగా ఆర్మూర్ పట్టణానికి చేరుకుంటుంది. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగనుంది. ఈ పాదయాత్రలో స్థానిక ప్రజల నుంచి సమస్యలపై ఆమె వినతులను స్వీకరించనున్నారు.