'అందెశ్రీ తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపారు'
TG: అందెశ్రీ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విచారం వ్యక్తం చేశారు. అందెశ్రీది సుదీర్ఘమైన ప్రజాసాహిత్యం అని అన్నారు. చదువుకోకున్నా అద్భుతమైన రచనలు చేశారని కొనియాడారు. అలాగే, సినిమా గాయకుడు, గీత రచయిత వందేమాతరం శ్రీనివాస్ అందెశ్రీ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పాటలతో తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపారని అన్నారు.