GOOD NEWS.. నేడు రైతు భరోసా నిధులు విడుదల
MNCL: రాష్ట్ర ప్రభుత్వం నేడు రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. ఇవాళ సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క సమక్షంలో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. తొలి విడతలో భాగంగా ఒక ఎకరం ఉన్న రైతులకు రూ.6,000 చొప్పున వారి ఖాతాల్లో జమ కానున్నాయి. మరో 20 రోజుల తర్వాత విడతల వారీగా మిగతా రైతులకు నిధులు జమ కానున్నాయి.