మంగళగిరిలో దళిత పారిశ్రామికవేత్తల నిరసన జ్వాల

మంగళగిరిలో దళిత పారిశ్రామికవేత్తల నిరసన జ్వాల

GNTR: ఎంఎస్ఎంఈలకు గత ఐదేళ్లుగా రావాల్సిన 100% రాయితీలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ, ఏపీ ఎస్సీ/ఎస్టీ జేఏసీ పారిశ్రామికవేత్తలు మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయం వద్ద మంగళవారం 6వ రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తమను చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన పారిశ్రామికవేత్తలు, ప్రోత్సాహకాలు విడుదల చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యమన్నారు.