మండల కాంగ్రెస్ అధ్యక్షుడి సతీమణి మృతి.. పలువురి నివాళి
MHBD: చిన్నగూడూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మారబోయిన వెంకటేశ్వర్లు సతీమణి మహేశ్వరి అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా.జాటోత్ రామచందర్ నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే ఆయన భార్య జాటోత్ ప్రమీల శుక్రవారం స్వయంగా వారి ఇంటికి వెళ్లి, ఆమె పార్దీవ దేహానికి నివాళి అర్పించారు. అలాగే కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.