రాష్ట్రంలో 150 ఆయుష్ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు
AP: రాష్ట్రంలో రూ.44 కోట్లతో 150 ఆయుష్ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. రెండు నెలల్లో ఈ ఆరోగ్య కేంద్రాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ చొరవతో ప్రాచీన వైద్యవిధానం బలోపేతం అవుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఆర్డీటీ లైసెన్స్ రెన్యువల్ పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పేదలకు మరిన్ని విద్య, వైద్య సేవలు అందుతాయని తెలిపారు.