జిల్లాను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతా: మాజీ ఎంపీ

KRNL: జిల్లాను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం అందిస్తానని మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు. ఇవాళ టీజీ వెంకటేశ్ స్వగృహంలో తైక్వాండోలో పతకాలు సాధించిన బి. విశ్వాసరావు ( బంగారు), చిరు చరణ్ తేజ (వెండి), కృష్ణవంశీ ( బ్లాక్ బెల్ట్) క్రీడాకారులను ఆయన అభినందించారు. 30 సంవత్సరాలు తాము క్రీడా రంగానికి సేవలు అందిస్తున్నామని తెలిపారు.