చిన వెంకన్న సన్నిధిలో నేటి నుంచి ధనుర్మాస శోభ

చిన వెంకన్న సన్నిధిలో నేటి నుంచి ధనుర్మాస శోభ

ELR: ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ద్వారకాతిరుమల చిన వెంకన్న క్షేత్రంలో మంగళవారం మధ్యాహ్నం 1.27 గంటలకు నెలగంట మోగనుండగా, 17 నుంచి స్వామివారి గ్రామోత్సవాలు మొదలవుతాయి. ఈ మాసమంతా ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై సేవను నిర్వహిస్తామని ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు.