ముస్తాబైన చెన్నకేశవ స్వామి ఆలయం

ముస్తాబైన చెన్నకేశవ స్వామి ఆలయం

NDL: అవుకులో వెలసిన పురాతన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు ముస్తాబయింది. అవుకు రాజ వంశీయులు చిన్న కృష్ణమరాజు 5వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా ఈ సారి రేపటి నుంచి ప్రారంభమై 17వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయని కమిటీ సభ్యులు వెల్లడించారు.