కే.శింగవరంలో దారుణ హత్య.!

కే.శింగవరంలో దారుణ హత్య.!

KRNL: సీ.బెళగల్ మండలం కే. శింగవరంలో మల్లేష్ అనే యువకుడు వేటకొడవళ్లతో దారుణంగా హత్యకు గురైన ఘటన ఇవాళ స్థానికంగా కలకలం రేపింది. ఘటనలో ప్రత్యర్థులు దాడి చేసి విచక్షణారహితంగా నరికి చంపారు. తీవ్ర రక్తస్రావంతో మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.