హైడ్రా అధికారులపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
TG: హైడ్రా అధికారులపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు హైడ్రా అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసి, BRSకు లాభం కలిగేలా చూస్తున్నారని అనుమానంగా ఉన్నట్లు ఆరోపించారు. అలాంటి వారిపై రంగనాథ్ దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ జగ్గారెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.