VIDEO: పెదనందిపాడులో 'సామాజిక తనిఖీ ప్రజావేదిక'

GNTR: పెదనందిపాడు మండల కేంద్రంలో శనివారం సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని, గ్రామీణ ఉపాధి హామీ పథకం(MGNREGS) కింద జరిగిన పనులను పరిశీలించారు. కూలీలకు చెల్లింపులు, పనిదినాలు, పనుల నాణ్యత వంటి అంశాలపై అధికారులు వివరాలు సేకరించారు. ప్రజావేదికలో గ్రామస్తులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.