భారీ వర్షాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

ఢిల్లీలోని యమునా నదికి వరద ఉద్ధృతి పెరిగింది. వరద ప్రవాహం 204.61 అడుగులకు చేరింది. దీంతో హతినీకుంజ్ బ్యారేజ్ నుంచి 50 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుంది. దీంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నది పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.