VIDEO: జనవరి 19 నుంచి కబడ్డీ పోటీలు: MLA
కృష్ణా: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో అండర్ - 14 జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వం ఆధ్వర్యంలో జనవరి 19 నుంచి ఐదు రోజులపాటు జరిగనున్నాయి. ఈ పోటీల నిర్వహణపై పురపాలక సంఘ కార్యాలయంలో ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్‌తో ఎమ్మెల్యే మంగళవారం సమావేశమయ్యారు.