వనపర్తిలో 40.7°Cకు చేరిన ఉష్ణోగ్రతలు
వనపర్తి జిల్లాలోని 21 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గత 24 గంటల్లో ఎండ తీవ్రత కొనసాగింది. అత్యధికంగా పానగల్‌లో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కేతపల్లి 40.6, వీపనగండ్ల 40.2, దగడ, మదనపూర్ 40.0 డిగ్రీలుగా నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 39.2 నుండి 39.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.