ప్రేమజంట ఆత్మహత్యయత్నం.. యువకుడు గల్లంతు

ప్రేమజంట ఆత్మహత్యయత్నం.. యువకుడు గల్లంతు

GNTR: చౌడవరం శివారులో విషాదం చోటుచేసుకుంది. ప్రేమజంట క్వారీ కుంటలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. యువతి ప్రాణాలతో బయటపడగా, యువకుడు గల్లంతయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక ఇంజినీరింగ్ కాలేజ్‌కు చెందిన యువకుడిగా గుర్తించగా, యువతి ఓ మిల్లులో పనిచేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు గజఈతగాళ్లతో శోధన చేపట్టారు.