ఇనుగుర్తి నూతన తహసీల్దార్‌గా.. శ్రీనివాస్
MHBD: ఇనుగుర్తి మండల నూతన తహసీల్దార్‌గా శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌కు పదోన్నతి లభించి ఇనుగుర్తి తహసీల్దార్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇంఛార్జ్ తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన తరంగిణి మళ్లీ డిప్యూటీ తహసీల్దార్‌గా కొనసాగనున్నారు.