భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
కృష్ణా: పోరంకిలో భార్య హత్య కేసులో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య రేణుకాదేవి (48)ను హత్య చేసి సహజ మరణంగా నమ్మించిన ముక్కామాల ప్రసాద్ చౌదరి (53)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో మహిళతో కలిసి భార్య హత్యకు పన్నిన పథకం కాల్ రికార్డర్‌లో నమోదైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.