వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై
మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద బుధవారం రాత్రి హనుమంతునిపాడు ఎస్సై మాధవరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కూడా చేపట్టారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. కారులో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ఆదేశించారు.