'విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి'

NLG: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం ఉన్నత పాఠశాల HM కందాల రమ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన క్రీడా పోటీలను బుధవారం ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు దేహ దారుఢ్యం పెంపొందుతుందన్నారు. గెలుపోటములు సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తి చాటాలన్నారు.