'కోవూరు ప్రజల అప్రమత్తంగా ఉండాలి'
NLR: ఓ వైపు విస్తారంగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో కోవూరు నియోజకవర్గ ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుధవారం సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ముందు జాగ్రత్తగా తీర ప్రాంత గ్రామాలైన మైపాడు, గంగపట్నం, రామతీర్థంలలో సైక్లోన్ షెల్టర్లను తుఫాను బాధితుల కోసం సిద్ధం చేయాలని కోరారు.