VIDEO: మేడారంలో నేటి రాత్రి దర్శనాలకు విరామం
MLG: మేడారంలో మండమెలిగే పండగ సందర్భంగా నేటి రాత్రి మేడారం వన దేవతల గద్దెల దర్శనాలను కొన్ని గంటల పాటు నిలిపివేస్తారు. రాత్రి 9 గంటల సమయంలో సమ్మక్క–సారలమ్మ పూజారులు గద్దెల వద్ద రహస్య పూజలు, జాగరణ నిర్వహించనుండటంతో లైట్లు ఆఫ్ చేసి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. తెల్లవారుజామున పూజలు పూర్తయ్యాక దర్శనాలు పునఃప్రారంభమవుతాయి.