చికిత్స పొందుతూ బాలిక మృతి

చికిత్స పొందుతూ బాలిక మృతి

కాకినాడ గ్రామీణం తూరంగికి చెందిన బాలిక (17) కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. బాలిక డిగ్రీ మొదటి ఏడాది చదువుతోంది. కుటుంబసభ్యులు మందలించడంతో మనస్తాపంతో డిసెంబర్ 3న ఇంటి వద్ద ఉరివేసుకుంది. ఆమెను కాకినాడ జీజీహెచ్‌లో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనిపై ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.