'రైతు పండించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తాం'

'రైతు పండించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తాం'

కృష్ణా: రైతుల వద్ద ఉన్న ధాన్యం చివరి గింజ వరకు మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రైతులకు భరోసా ఇచ్చారు. మంగళవారం పురుషోత్తపట్నంలోని రైతు సేవా కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతు సేవా కేంద్రం ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని పరిశీలించారు.