అభినందన సభకు బయలుదేరిన బీజేపీ నాయకులు

NZB: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి గురువారం రోజు బీజేపీ చలో హైదరాబాద్ ఫర్ సెల్యూట్ తెలంగాణ, అభినందన సభకు ఆర్మూర్ పట్టణ బీజేపీ నాయకులు బయలుదేరారు. హైదరాబాద్ లోని నాంపల్లిలో గల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లోక్ సభ సభ్యులు ధర్మపురి అరవింద్‌ల అభినందన సభ కార్యక్రమంలో పాల్గొననున్నారు.