15న తిరుపతికి రానున్న మారిషస్ PM

15న తిరుపతికి రానున్న మారిషస్ PM

TPT: మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రాంగుళం ఈనెల 15న తిరుపతికి రానున్నారు. తిరుపతి సమీపంలోని రామాపురం బ్రహ్మ రిషి ఆశ్రమాన్ని సందర్శిస్తారని అధికారులు పేర్కొన్నారు. అనంతరం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతారని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ వెంకటేశ్వర్ భద్రత ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.