భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
ELR: ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో డిసెంబర్ 1వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బుధవారం పోలీసులు భద్రత చర్యలు పరిశీలించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ భద్రత ఏర్పాట్లని పరిశీలించి అధికారులకి సూచనలు చేశారు. అలాగే వాహనాల మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పర్యటన ప్రశాంతంగా, సురక్షితంగా ముగిసేలా ప్రతి అధికారి బాధ్యత వహించాలని సూచించారు.